మనం చూస్తున్న ఇంకో జగపతిబాబు!

ఒక అభిమాన హీరో సినిమా కాస్త ఆలస్యం అయితే ఒక రకమైన నిరుత్సాహానికి లోనవడం పర హీరో అభిమానిగా మనం గమనించే విషయం.అదేవిధంగా హీరోలు సైతం అభిమానులను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తుంటారు, ఒకవేళ పర భాషలో ప్రతినాయకుడి పాత్ర వచ్చిన ఎట్టి పరిస్థుతులలో ఒప్పుకోరు.కెరీర్ కొనసాగినంత కాలం వెంట వెంటనే ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు,అలా హఠాత్తుగా ఆ హీరో నుండి సినిమాలు రాకపోవడం జరుగుతుంది. అతి సాధారణ చిన్న హీరో విషయంలో అయితే పర్లేదు,కానీ ప్రేక్షకుల ఆదరణ పొంది కొన్ని సినిమాల వరకు కథానాయకుడిగా కొనసాగి స్టార్ డమ్ స్థాయిని సంపాదించుకొని కెరీర్ డౌన్ అయిపోయిన క్రమంలో ప్రతినాయకుని పాత్రలను పోషిస్తుంటారు.అయితే అన్ని భాషల్లో ఇది కామన్. తెలుగులో ఇప్పటివరకు సాయికుమార్ ,సుమన్,ఇలా చాలా మంది ప్రతినాయకుని పాత్రను కొనసాగిస్తున్నారు,ఆ క్రమంలో ప్రేక్షకుల స్వీకరణ కూడా అధ్బుతంగా ఉంటుంది.

100 కి పైగా సినిమాల్లో హీరోగా చేసి తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు మేన్లి స్టార్ జగపతిబాబు గారు.కెరీర్ ఆరంభంలోనే వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకు పరిచయం అయ్యారు, ఆ తర్వాత ‘పెద్దరికం’ సినిమాతో అఖండ విజయం అందుకున్నారు తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం సినిమాతో మాస్ ప్రేక్షకులకు ఆ తర్వాత వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ మరియు ముఖ్యంగా మహిళ ప్రేక్షకులకి చేరువయ్యారు,మావిచిగురు శుభాకాంక్షలు, పెళ్లి పందిరి,అంత:పురం లాంటి సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ స్టార్ డమ్ తెచ్చుకున్నారు.ఇలాంటి ఒక హీరోకి చివరగా పెదబాబు సినిమా రూపంలో అతిపెద్ద హిట్ పడింది ఆ తర్వాత చాలా సినిమాలొచ్చిన ఈ సినిమాని దాటలేకపోయాయి.

2007 లో వచ్చిన లక్ష్యం సినిమాతో తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి,మధ్యలో ఒక రెండు సినిమాల్లో సహానటుడిగా చేసిన దాదపు 7 సంవత్సరాల తర్వాత లెజెండ్ సినిమాతో పూర్తి స్థాయి ప్రతినాయకుడిగా నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసారు.

ఇక ఆ తరువాత వరుస పెట్టి దాదాపు అన్నీ తెలుగు సినిమాల్లో పాత్రమేరకు నటించి పర ప్రాంత ఆర్టిస్టులు అవసరం లేకుండా చేస్తున్నారు.ఇటు విలన్ గా చేస్తునే హీరోకి తండ్రి పాత్రలోనూ మెప్పిస్తూ వస్తున్నారు.

లెజెండ్, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో,జయ జానకి నాయక,రంగస్థలం మొన్న వచ్చిన గూఢచారి సినిమాల్లో తనకి పడిన పాత్రలకి ఒక ప్రేక్షకుడిగా జగపతిబాబు గారి సెకండ్ ఇన్నింగ్స్ అధ్బుతహా అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: