రొటీన్ చిత్రాల హ్యాట్రిక్ డైరెక్టర్!

ఏదైన సినిమా వస్తుందంటే ఆ సినిమాలో ఏదైన కొత్తదనం ఉండాలనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రేక్షకులు.ఒకవేళ సినిమాలో అదే మాస్ మసాలా,అదే రొటీన్ సబ్జెక్ట్ ఉందని తెలిస్తే ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా పోరు ఎందుకంటే ఏదైన కొత్తగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు.వెబ్ సిరీస్ లకి బ్రహ్మరథం పట్టారు అందులో థ్రిల్లింగ్ & ఫన్ ఉన్న సబ్జెక్ట్ దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే కాబట్టి,కానీ ఈ డైరెక్టర్ సారీ ఈ డైరక్టర్స్ వేరు అదే రొటీన్ ఫార్ములా అదే మాస్ మసాలా అవే ఆరు పాటలు అవే ఇంటర్వెల్ ఎపిసోడ్లు అయిన వీళ్ల సినిమాలు సూపర్‌ హిట్లు అవుతున్నాయి,బ్లాక్ బస్టర్ గా నిలుస్తున్నాయి.

ఒక్క ఫ్లాప్ ఉన్న బోయపాటి శ్రీను కానీ ఒక్క ఫ్లాప్ కూడా లేని అనిల్ రావిపూడి గానీ తమ సినిమాల్లో ఆద్యంతం ప్రేక్షకులకి కావాల్సిన మెటీరియల్ ఉంటుంది.భద్ర తులసి సింహా మొన్నొచ్చిన జయ జానకి నాయక వరకు యాక్షన్&ఫ్యామిలీ యే, రేపు విడుదలైయ్యే వినయ విధేయ రామ వరకు అన్నీ అటు ఆయా అభిమానులను ఇటు సగటు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఇక అనిల్ రావిపూడి విషయానికొస్తే పటాస్,సుప్రీమ్,రాజా ది గ్రేట్ అన్నీ 90 వ సంవత్సరం కథలే,కానీ సినిమా మొత్తం హాస్యభరితంగా అటు క్లాస్ ఇటు మాస్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా మొత్తం నడిపిస్తాడు కాబట్టే అన్నీ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.

రేపు విడుదలైయ్యే ఎఫ్ 2 కూడా అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా కనిపిస్తుంది,ఏదేమైనా వీళ్లు తీసుకున్న కథలు పాతవే అయిన ట్రీట్‌మెంట్‌ మాత్రం కొత్తగా ఉంటుంది ప్రేక్షకుల నాడీ తెలిసిన డైరక్టర్స్ ఇద్దరూ.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: