KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

అందరూ ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్!

Reading Time: 1 minute

ఒక హీరోకి ఒక ఫ్లాప్ సినిమా వచ్చిందంటే వెంటనే ఒక సూపర్ హిట్ ఉంటేనే ఆ హీరో అభిమానుల్లో క్రేజ్ తగ్గకుండా ఉంటుంది, అలాగే ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి ఒక సినిమా ఫ్లాప్ పడింది అంటే మళ్ళీ వెంటనే ఆ డైరెక్టర్ నుండి ఒక బ్లాక్ బస్టర్ వస్తే గానీ కుదుటపడదు సినీ అభిమానులకి అలాంటిది వరుస పరాజయాలతో ఉన్నారు డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు.అదేవిధంగా ఇప్పుడున్న యంగ్ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఒకరు,సినిమా ఫలితం గురించి పక్కన పెడితే ఇప్పటి వరకు తను చేసిన ఏ సినిమాలోనైన నటనలో ఎనర్జీ కోల్పోలేదు,ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తున్నారు కానీ సరైన సినిమా పడట్లేదు.

ప్రస్తుతం వరుస పరాజయాలతో ఉన్నాడు రామ్,పూరి జగన్నాథ్ గారికి తన రేంజ్ సినిమా ఒకటి కావాలి అలాగే రామ్ కి కూడా మాంచి కమర్షియల్ సినిమా కావాలి, ఇప్పుడున్న టైంలో ఇదే కరెక్ట్ కాంబినేషన్ అందుకే క్రేజీ కాంబినేషన్ అయింది.నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ కూడా యమ క్రేజ్ గా ఉంది.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.