KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

మరో నాలుగు తరాలకి కావాల్సిన ఏ.ఆర్ రెహమాన్!

Reading Time: < 1 minute

మన దేశంలో సినిమాలు చూడని వారు ఉంటారేమో కానీ సంగీతం వినని వారు ఉండరు. అందులోనూ ఏ.ఆర్ రెహమాన్ గారి సంగీతం తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.ఇప్పటి తరం వారిని అడిగితే రెహమాన్ గురించి అంతగా తెలియని వారుంటారేమో కానీ ఒక సారి 1990 లో ఉన్న తరం వాళ్లని అడిగి చూడండి.మణిరత్నం’రోజా’ సినిమాతో యావత్ భారతదేశంలో రెహమాన్ సంగీతం మారుమోగిపోయింది,సంగీత ప్రియులని ఉర్రూతలూగించింది.ఇప్పుడు ఏ.ఆర్ రెహమాన్ గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు ఇప్పటికీ తన సంగీతం గురించి చెవి కోసుకునే వారుంటారు ముఖ్యంగా తను సంగీతం అందించిన సినిమాల్లో నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోస్తుంది,ఉదాహరణకి మణిరత్నం ఇంక శంకర్ సినిమాలే నిదర్శనం. పాటలు కానీ నేపథ్యం కానీ కనెక్ట్ అవడానికి కొంచెం టైం పట్టోచ్చు కానీ ఒక్కసారి టచ్ అయిందంటే అవి రిపీటెడ్ లిస్ట్ లోకి వెళ్లిపోవడం ఖాయం.ఒక్కమాటలో చెప్పాలంటే ‘ మా తుజే సలామ్’,జై హో ఇవి రెండు చాలు ది గాడ్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పాడానికి,ఇంకో నాలుగు తరాలకి కావాల్సిన సంగీత దర్శకుడు అని. ఈ రోజుతో 52 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Video Credits :

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.