అసలు సిసలైన పండుగ సినిమా వాతావరణం!

ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదలవ్వడం సర్వధారణం,వాటిలో కొన్ని కాంబినేషన్ ని బట్టి ఓపెనింగ్స్ తో విజయం ఖరారు అవుతాయి,మరికొన్ని మౌత్ టాక్ తో హిట్ అవుతాయి ఇప్పుడున్న పరిస్థితులలో మొదటి మూడు రోజులు ప్రేక్షకులకు మంచి వినోదం.మరి అలాంటి కాంబినేషన్ లలో అది కూడా పండుగ సమయంలో కుటుంబ సమేతంగా చూడాలిసిన సినిమాలు విడుదలైతే ఆ పండుగ వాతావరణం మరింత రెట్టింపు అవుతుంది.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమా శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మొదటి భాగమైన ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ రేపు బ్రహ్మాండంగా విడుదలవుతోంది,సినీ పరిశ్రమలో బయోపిక్ లు అద్భుతంగా తెరకెక్కిస్తునందున అందులోనూ అలనాటి హీరోయిన్ ‘సావిత్రి’ గారి జీవిత కథ ఆధారంగా తీసిన ‘మహానటి’ మంచి విజయం సాధించడం వల్ల ప్రేక్షకులకు ఇలాంటి బయోపిక్ ల మీద మంచి ఆసక్తి నెలకొంది.ఇక ఈ బయోపిక్ మొదలు పెట్టిన దగ్గర్నుంచే అంచనాలు తారాస్థాయికి వెళ్లిపోయాయి.భారీ తారాగణంతో రూపొందించబడిన ఈ సినిమా నిడివి 2 గంటల 51 నిమిషాలు.

తమిళ సెన్సేషన్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటించిన సినిమా ‘పేట’ ఈ నెల 10న విడుదలౌతుంది.తలైవా అభిమానులకి కావాలిసిన మెటీరియల్ ఇందులో కనిపిస్తుంది అంతేకాకుండా రజనీ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది,ఈ సినిమా కూడా ఇలాంటి సమయం లో మంచి ఛాయస్ అవుతుంది అనిపిస్తుంది,ఈ సినిమా నిడివి కూడా 2 గంటల 51 నిమిషాలు.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ ఈ నెల 11న విడుదలౌతోంది.కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో సీనియర్ హీరో హీరోయిన్లు ఆర్యన్ రాజేష్ , ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా యాక్షన్&ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది.ఈ సినిమా నిడివి 2 గంటల 26 నిమిషాలు.

హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్,వరుణ్ తేజ్ నటించిన మల్టీస్టారర్ ‘F2’. తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా నటించారు.ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తుంటే అవుట్&అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తుంది.ఈ నెల 12న విడుదలవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 28 నిమిషాలు.


మొత్తానికి ఒక్కో రోజు ఒక్కో సినిమా 4 రోజులు నాలుగు సినిమాలు నాలుగు ప్రత్యేక సబ్జెక్టులు,సకుటుంబ సమేతంగా ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద కనువిందు కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: