బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ తో ఈ సినిమాని పోల్చలేం!

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఒక రకమైన అంచనాలు పెరిగిపోతాయి,వాళ్ళకి కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉంటాయి ఇక మాస్ కి మాత్రం కొదువే ఉండదు.ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాలు మామూలు రోజుల్లో విడుదలవ్వడం ఒక విషయం అయితే పండుగ సమయం లో విడుదల అవ్వడం ఒక విషయం అందులోనూ సంక్రాంతి,అవును ఈ పండక్కి వచ్చిన సినిమాలన్నీఅఖండ విజయం సాధించాయి.

అందులో మొదటగా 1999 లో వచ్చిన సమరసింహారెడ్డి జనవరి 13న విడుదలైయింది,రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ కథ తో అవుట్ & అవుట్ మాస్ ఇంకా ఫ్యామిలీ ప్రేక్షకులని అలరించింది, బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు రావడానికి ఈ సినిమా ప్రభావం గట్టిగానే పడింది అని చెప్పొచ్చు.

ఇక 2001 సంవత్సరంలో వచ్చిన నరసింహ నాయుడు ఇదే పండుగ కి అంటే జనవరి 11న విడుదలైయింది,కొంచెం సమరసింహా రెడ్డి సినిమా కి అటు ఇటు ఉన్న రెండు సినిమాలకి దర్శకుడు ఒకరే కావడం వల్లనేమో ఈ సినిమా కూడా ఫ్యాక్షనిస్ట్ నేపథ్యం లో వచ్చి కాస్త బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ ను టచ్ చేసి 2001 సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

2002 వ సంవత్సరం లో వచ్చిన సీమసింహం బాలకృష్ణ అభిమానులను అలరించింది,బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గా ఆడకపోయినా మౌత్ టాక్ తో మాస్ ని అలరించి విజయం వైపు ప్రదర్శించింది.ఇది కూడా జనవరి 11న విడుదలై , సంక్రాంతి రేసులో నిలిచింది.

2004 వ సంవత్సరం లో వచ్చిన లక్ష్మీనరసింహ బాలకృష్ణ అభిమానులతో పాటు మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్ హిట్ గా నిలిచింది.విజయవాడ రౌడీ ముఠా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ గారి నటన హైలెట్ గా నిలిచింది.జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సామి సినిమాకి రీమేక్,ఇది కూడా సంక్రాంతి సూపర్ హిట్టే.

2017 లో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి కూడా జనవరి 12న విడుదలై మంచి విజయం సాధించింది.చారిత్రత్మక నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా శాతవాహన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందించబడింది.జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా సాధ్యం కానీ 79 రోజులలో చిత్రీకరణ పూర్తిచేసుకుంది.మరో సంక్రాంతి హిట్ గా నిలిచింది.బాలకృష్ణ గారికి ఇది 100వ సినిమా కావడం విశేషం.

ఇక చివరగా 2018 లో విడుదలైన ‘జై సింహ’ కూడా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ గా ఇంక బాలకృష్ణ గారి కెరీర్లో మరో సారి సంక్రాంతి హిట్ గా నిలబడింది.మాస్ సినిమాల దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా కథ పాతదే అయినా ట్రీట్మెంట్ కొత్తగా ఉండడం,ఇంకా మాస్ అంశాలు పుష్కలంగా ఉండడం ఈ సినిమా విజయం సాధించడానికి దోహదం చేశాయి.

ఇప్పుడు ప్రస్తుత విషయానికొస్తే మరో సారి క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ గారి కలయికలో తెలుగు వారందరూ ముద్దుగా పిలుచుకునే ‘అన్నగారు’ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత నేపథ్యం లో తెరకెక్కించిన మొదటి భాగమైన ‘ఎన్.టి.ఆర్ కథానాయకుడు’ ఈ నెల అంటే జనవరి 9 న విడుదలౌతోంది,ఈ సినిమాకి బాలకృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ కి ఎలాంటి సంబంధం లేదు అని గర్వంగా చెప్పొచ్చు.ఈ సినిమా ప్రచార చిత్రం చూస్తేనే తెలుస్తుంది ఇదొక భారీ విజయపు సినిమా అని,అలాగే భారీ తారాగణం ఈ సినిమా లో భాగమైన విషయం అందరికీ తెలిసిందే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: