అభిమాన కథానాయకులు ప్రతినాయకులుగా కూడా చాలా బావున్నారు !

మనం చిన్నప్పటి నుండి చూసే యాక్షన్ హీరోలంతా ఇప్పుడు విలన్ లు గా సినిమాల్లో కనిపిస్తున్నారు మెప్పిస్తున్నారు.

మ్యాన్లీస్టార్ జగపతి బాబు కానీ యాక్షన్ కింగ్ అర్జున్ ,అరవింద్ స్వామి కానీ హీరో గా చాలా సినిమాల్లో నటించారు,జగపతి బాబు,అర్జున్ కలిసి చేసిన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా అయితే ఇప్పటికీ మన ఫేవరెట్ సినిమానే ఎన్నిసార్లు చూసిన ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.అలాంటి హీరోలు ఇప్పటి సినిమాల్లో విలన్లుగా చేసిన మనం అంగీకరిస్తున్నాం.ఇక వాళ్ళతో పాటు అప్పుడపుడు శ్రీకాంత్ గారు కూడా విలన్ గా చేసి అలరిస్తున్నారు,పర ప్రాంత నటులు వీళ్ళతో పోటీగా వీళ్ళు వాళ్ళకి పోటీగా స్టైలిష్ విలన్ లు గా సినిమా ఆద్యంతం తమ తమ పాత్రలకి న్యాయం చేస్తున్నారు,విలన్ అనగానే ఏదో నెగిటివ్ గా కాకుండా హీరో కి ధీటుగా ఏమాత్రం తగ్గకుండా ఇప్పటి సినిమాల్లో వాళ్ళకి క్యారెక్టర్ దొరుకుతుంది, అందులో మొదటగా

2014 లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘లెజెండ్’ సినిమాతో పవర్ ఫుల్ విలన్ గా బాలకృష్ణ కి ఏమాత్రం అటు ఇటు కాకుండా పోటీగా నటించారు జగపతి బాబు,అంతకుముందు నుండే నెగిటివ్ గా సినిమాల్లో కనిపించిన ఈ సినిమాతోనే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని చెప్పాలి.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఇంటెలిజెంట్ విలన్ గా ఆయన కనిపించారు,ఆయన కూడా హీరోనే కదా అని ప్రేక్షకులు మరిచిపోయేలా ఉంది ఆయన క్యారక్టర్రైజేషన్.కరెంటు తీగ లో కానీ రంగస్థలం ఈ మధ్యే వచ్చిన గూఢచారి లో ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రల్లో మెప్పిస్తున్నారు.ఇలా విలన్ అనే కాకుండా ఇప్పటి హీరో,హీరోయిన్లకి తండ్రి పాత్రలోనూ సహాయనటుడికి కూడా చక్కగా పాత్రల్లో ఒదిగిపోతున్నారు.

ఇక యాక్షన్ కింగ్ అర్జున్ గారి విషయానికొస్తే మన కుర్రతనం లో ఆయన చేసిన సినిమాల కంటే అందులోని ఫైట్లని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం
అని చెప్పడం లో సందేహమే లేదు.మన్నెంలో మొనగాడు,మా పల్లెలో గోపాలుడు, జెంటిల్ మేన్,ఒకేఒక్కడు,రిథమ్ ఇలాంటి సినిమాల్లో చూసిన యాక్షన్ కింగ్ ఎక్కడ?..ఆ తరం ప్రేక్షకులని ఆ తరహాలో అలరించి ఈ తరం ప్రేక్షకులని స్టైలిష్ హీరోగా, ముఖ్యంగా విలన్ గా ఇంకా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు.గ్యాంబ్లర్ (మంకథ తమిళం) లో ఒక తరహాలో, అన్నిటికంటే ‘లై ,అభిమన్యుడు’ సినిమాల్లో విలన్ గా చేసిన పాత్ర తెలుగు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది.హీరో కి ఎన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయో అలాగే విలన్ పాత్రకి ఉండడం వాళ్ళ అది అర్జున్ లాంటి హీరో చేయడం వల్ల యాక్షన్ కింగ్ ని మర్చిపోయి ఒక కొత్త ఆర్టిస్ట్ ని చూసినట్లనిపించింది.నా పేరు సూర్య లో అల్లు అర్జున్ కి తండ్రిగా చేసిన పాత్ర ఆ సినిమా కి కొంతవరకు ప్లస్ అయిందనే చెప్పాలి.

ఇంకొక పాత హీరో & హ్యాండ్సమ్ & ఎవర్గ్రీన్ అరవింద్ స్వామి విషయానికొస్తే దళపతి తో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయి అందులో రజనీకాంత్ కి పోటీ గా నటించి ఇటు తెలుగు అటు తమిళం లో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘రోజా,బొంబాయి,మౌనం,సఖి సినిమాలతో అభిమానులని సొంతం చేసుకున్నారు.మళ్ళీ చాలా కాలం తర్వాత ‘ధ్రువ’ సినిమాతో తెలుగు వారిని పలకరించారు.ధ్రువ కి మాతృక అయినా తనిఒరువన్ లో కూడా ఆయనే చేయడం వల్ల రెండు రాష్ట్రాల ప్రేక్షకులకి ఒక మంచి ప్రతినాయకుడు దొరికాడు అనిపిస్తుంది.సిద్దార్థ్ అభిమన్యు గా ఆయన చేసిన క్యారెక్టర్ రెండు భాషల సినిమాలకి చాలా అంటే చాలా ప్లస్ అయింది,గంభీరంగా ఒక డిఫరెంట్ కోణంలో సినిమా మొత్తం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు,ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్లు గా ఉంది ఆ క్యారక్టర్.ఇక ఈ మధ్య వచ్చిన మణిరత్నం ‘నవాబ్’ సినిమాతో సగం సినిమా హీరోగా సగం సినిమా విలన్ గా ఉండడం వల్ల ఆ సినిమాకి కూడా అరవింద్ స్వామి యే హైలెట్ గా నిలిచారు.

ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఒక్కప్పటి స్టార్స్ కానీ ఇప్పటి స్టార్స్ కానీ హీరో గా చేసిన విలన్ గా ఇప్పటి విలన్ లు విలన్లుగా చేసిన సినిమా ఫలితం ఎలా ఉన్న నటనలో మాత్రం ఏమాత్రం నిరుత్సాహపర్చడం లేదు.సీనియర్ హీరో సుమన్ గారిని మనం ‘శివాజీ’ సినిమాతో పర్మినెంట్ గా విలన్ గానే ఫిక్స్ చేసుకున్నాం,ఇక ‘సరైనోడు,అజ్ఞతవాసి’ లో ఆది పినిశెట్టి కనబర్చిన పెర్ఫార్మన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.దేవదాస్ సినిమాలో కునాల్ కపూర్ గానీ,సుప్రీమ్ సినిమాలో చేసిన కబీర్ దుహన్ సింగ్ కూడా పలు సినిమాల్లో స్టైలిష్ విలన్ గానే పేరు తెచ్చుకున్నారు వాటిలో జిల్,సుప్రీమ్ చెప్పుకోదగ్గవి.ఇక రొమాంటిక్ హీరోగా పేరున్న మాధవన్ ఈ మధ్యే ‘సవ్యసాచి’ సినిమాతో పూర్తిస్థాయి పాత్రతో మొదటి సారిగా తెలుగు లో నటించారు, క్రూరమైన విలన్ గా గంభీరమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించారు.
ఏదేమైనా హీరోలు విలన్లు అనే స్థాయిని పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ప్రతినాయకుని పాత్రల్లో స్టైలిష్ గా కథానాయకునికి పోటాపోటీగా ఎదురుగా సవాల్ తో నటించి ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంటున్నారు మన ఈ తరం విలన్లు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: