అన్నగారికి అందించిన అద్భుతమైన నివాళి !

నందమూరి అభిమానుల్లోనే కాక సగటు ప్రేక్షకుల్లో సైతం ఆసక్తిని రేపింది ‘ఎన్.టి.ఆర్’ బయోపిక్.అందులోని మొదటి భాగం ‘కథానాయకుడు’ భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలయింది.ఇక మొదటి ఆట నుండే సినిమాకి పాజిటివ్ టాక్ రావడం మొదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది, అవును బాలకృష్ణ ‘ఎన్.టి.ఆర్’ గెట్అప్ లో అద్భుతంగా సరిపోయారు,ఎవరు సరిపోరు అన్నంతగా ఒదిగిపోయారు.

సమీక్షా రూపంలో కాకుండా రెండే రెండు మాటల్లో చెప్పాలంటే ఒక సాధారణ రైతు కుటుంబం లో పుట్టిన రామారావు గారు ఒక రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుంటారు, ఉద్యోగంలో చేరిన వారానికే రాజీనామా చేసి సినిమాల మీద ఆసక్తితో ఇంట్లో చెప్పి ఎప్పుడో ఎల్.వి ప్రసాద్ గారు రాసిన ఉత్తరం పట్టుకొని మద్రాసు రైలు ఎక్కుతారు,ఆ తర్వాత నటుడిగా సినిమాల్లో ఎలా రాణించారు, మొదట్లో ఎదురైన పరిస్థితులు ఎలాంటివి? విజయ వాహిని అధినేతలు అయిన నాగిరెడ్డి-చక్రపాణి సహాయంతో రామారావు గారు ఎలా స్టార్ గా మారారు అనేది కథ.
అయితే కెరీర్ ఉచ్చ దశకు చేరుకున్నాక ప్రజా సేవ చేయాలన్న కాంక్ష మొదలవుతుంది.దీంతో రాజకీయాల్లోకి నిర్ణయించుకొని ఎలాంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు, వాటికి దోహదపడిన అంశాలు ఏంటీ అనేవే ఈ సినిమా కథ.

బసవతారకం పాత్రలో విద్యాబాలన్ పర్ఫెక్ట్ ఛాయిస్, వీళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ న్యాయం చేసేవారు కాదేమో అనిపిస్తుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రను పోషించిన సుమంత్ కొన్ని క్షణాలు ఆయన్ని గుర్తుచేశారు, ఇక హరికృష్ణ గారి పాత్రలో కళ్యాణ్ రామ్ యే కరెక్ట్ అనిపించుకున్నారు.షాలిని పాండే,
హన్ సిక,ప్రణిత,రకుల్ ప్రీత్ సింగ్,పాయల్ రాజ్ పుత్,బ్రహ్మనందం,శుభలేఖ సుధాకర్,ఎస్వీ కృష్ణా రెడ్డి వీళ్ళంతా మహా అయితే రెండు నిమిషాల కంటే ఎక్కువగా కనిపించరు కానీ ఆకర్షణగా నిలుస్తారు.సావిత్రి పాత్రలో నిత్యామీనన్ పర్వాలేదనిపించుకుంది బహుశా కీర్తి సురేష్ ని మరిచిపోలేకుండా ఉండడం వల్లనేమో.ప్రకాష్ రాజ్,క్రిష్ ల పాత్రలు మహానటి లోని పాత్రలను గుర్తు తెచ్చాయి.
ఎం.ఎం కీరవాణి గారి సంగీతం రెండు పాటలు తెర మీద ఆకట్టుకోగా నేపథ్య సంగీతం మాత్రం అద్భుతంగా ఉంది,సినిమాలో చాలా సన్నివేశాలు పండడానికి ఉపయోగపడిందని చెప్పాలి‌.బుర్రా సాయి మాధవ్ రాసిన మాటలు కొన్ని చోట్ల అద్భుతంగా అనిపించాయి.బాలకృష్ణ,వారాహి,విబ్రి సహా నిర్మాణ విలువలు బావున్నాయి.


ఇక దర్శకుడు క్రిష్ విషయానికొస్తే ఇచ్చిన స్క్రిప్ట్ కి కట్టుబడి కోరుకున్న అవుట్ పుట్ ఇచ్చాడనిపిస్తుతుంది కొన్ని చోట్ల సహజత్వం మిస్ అయినప్పుడు, అయిన సరే ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి కథ తెరకెక్కించాలంటే క్రిష్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు అనిపిస్తుంది.
చివరగా సినిమాలో తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించగానే మహానాయకుడు లో మిగిలిన భాగం చూడమని అంతవరకి సినిమా అయిపోతుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: