నాలుగు రోజుల ముందే రజని అభిమానులకు వచ్చేసిన పండుగ..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సెన్సేషన్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘పేట’,భారీ పోటీ మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఇక సీనియర్ హీరోయిన్ సిమ్రాన్,త్రిష మరో ముఖ్య పాత్రలో సెన్సేషన్ స్టార్ విజయ్ సేతుపతి,బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రతినాయకుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు.

సినిమా విషయంలోకెళితే రజినీకాంత్ ఓ మాములు హాస్టల్ లో వార్డెన్ గా జాయిన్ అవుతాడు.ఆ క్యాంపస్ లో జరిగే ర్యాగింగ్స్ ను రజిని తనదైన స్టైల్ లో డీల్ చేస్తాడు.అందులో ఓ ప్రేమ జంటకి వారి ప్రేమ విషయం లో సహాయం చేస్తానని మాటిస్తాడు.అదే సమయం లో ప్రాణిక్ హీలర్ గా సిమ్రాన్ పరిచయం అవుతుంది,ఆ పరిచయం బాగా దగ్గరయ్యే సరికి ఊహించని సంఘటనల మధ్య రజిని పై ప్రేమ విషయంలో రజిని సహాయం చేస్తున్న ఆ జంట పై ఓ గ్యాంగ్ దాడి చేస్తుంది,ఇక అక్కడినుంచి మిగితా సినిమాలో ఎలాంటి పరిణామాలు చోటు చేస్కున్నాయి,ఆ ప్రేమ జంట ఎవరు?రజిని వార్డెన్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు,అతని గతం తాలూకు కథ ఏంటి?విజయ్ సేతుపతి,త్రిష పాత్ర ఏంటి? అనేదే మిగితా సినిమా.

సినిమా మొదలు నుంచి చివరి దాకా మనం ఇది వరకు చూసిన కమర్షియల్ ఫార్మాట్లోనే రన్ అవుతుంటుంది,ఉదాహరణకు రజిని కాంత్ బ్లాక్ బస్టర్ ‘భాషా’ స్థాయి లో నెరేషన్ అవుతూంటుంది.రజిని కి గతం ఉందని చూసే ప్రేక్షకులకు ఈజీగా అర్ధమైపోతుంది కాబట్టి ఎలివేషన్ సీన్స్ వచ్చినపుడు ఎక్కువగా రియాక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది.ఈ సినిమాలో ఒక కొత్త రజిని ని చూస్తారు అనేకంటే మన పాత రజినీయే గుర్తుకొస్తారు అనడం బెటర్.హాస్టల్ వార్డెన్ గా నటించిన ఆయన,తన పాత్రకు తగ్గట్లు తన లుక్ ను మార్చుకొని తన బాడీ లాంగ్వేజ్ తో,మరికొన్ని సీన్స్ లో అయితే సెటిల్డ్ పెర్ఫామెన్స్ తో సినిమా ఆద్యంతం హైలెట్ గా నిలిచారు. ముఖ్యమైన, సినిమాలో మరో కీలకమైన పాత్రలో నటించిన విజయ్ సేతుపతి ఎప్పటిలానే ఇటు కామెడీ టైమింగ్ తో,అటు గాంభీర్యమైన నటనతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.ఇక సిమ్రాన్,త్రిష సినిమాలో ఉన్నంత సేపు తమ తమ పాత్ర మేరధి నటనతో గ్లామరస్ గా కనిపించి ఆకట్టుకున్నారు.విలన్ గా చేసిన నవాజుద్దీన్ సిద్ధిఖీ విషయానికొస్తే క్రూరత్వంతో కూడుకున్న విలన్ గా ఆయన నటన చాలా బాగుంది,సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు విషయానికొస్తే స్నేహానికి,పగకి సంబంధించి మంచి స్టోరీ లైన్ తీస్కున్నారు,రజిని స్టైల్ ని మ్యానరిజంని దృష్టిలో పెట్టుకొని ఎలా చూపించాలో అలా చూపించారు.ఫస్ట్ హాఫ్ లో రజిని, సిమ్రాన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకునేలా ఉంది.రజిని మార్క్ యాక్టింగ్,యాక్షన్ సీన్స్ అలాగే ద్వితీయార్ధం లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా తీశారు.ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం హీరో అభిమానులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే తీశారు అనిపిస్తుంది.ఇక అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది,హీరో ఎలివేషన్ సీన్స్ అప్పుడు వచ్చే బీట్స్ బావున్నాయి,అలాగే ఒక పాట కూడా చాలా బావుంది.యస్ తిరు సినిమాటోగ్రఫీ బాగుంది,సినిమాలోని చాలా సన్నివేశాల్లో చాలా అందంగా చిత్రీకరించారు.ఎడిటర్ వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు,ఇక నిర్మాత విషయానికొస్తే ఎక్కడ తగ్గకుండా దర్శకుడికి కావలిసినవి అందించి ఈ సినిమానూ నిర్మించారు అనిపిస్తుంది.


పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాని వేరే ఇతర సినిమాలతో పోల్చి చూడొద్దు,కమర్షియల్ అన్న తర్వాత గ్యారంటీగా తెలిసిన నేరేషన్ లోనే ఉంటుంది కానీ ఒక హిట్ సినిమా కి కావలిసిన కంటెంట్ అయితే ఉంది,ఈ పండక్కి ఈ సినిమా కూడా ఒక మంచి ఛాయస్ యే అని మాత్రం చెప్పొచ్చు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: