భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న సాహో!

‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో.ఈ చిత్రం యొక్క షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.భారీ బడ్జెట్ తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది,ఇంతవరకు భారతదేశ సినీ చరిత్రలో చూడని విజువల్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందటా.

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు, ఇక తమన్ అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది అని సమాచారం.హాలివుడ్ రేంజ్లోని యాక్షన్ నేపథ్యంలో సుజీత్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.యూవీ క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ ఏడాది ఆగష్టు 15న విడుదల కానుంది.

ఇక సినిమాతో పాటు ప్రభాస్ తన 20వ చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నారు, ఇటీవలే ఇటలీ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్కుంది.పీరియాడికల్ లవ్ స్టోరి నేపథ్యంలో తెరకెక్కిస్తున ఈ సినిమాలో పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తుంది.యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకి ‘జాన్ ‘ అనే టైటిల్ అధికారికంగా ఖరారు కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: