ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి పదమూడు సంవత్సరాలు!

2006 లో దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో రామ్. వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.రామ్ కు జోడిగా నటించిన ఇలియానా కూడా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయ్యింది.రొమాంటిక్ ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమాకి చక్రి గారు సంగీతం అందించారు, అన్ని పాటలు ఆల్ టైం హిట్ అయ్యాయి.ఏడు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 14 కోట్ల దాకా వసూల్ చేసింది, వై.వి.యస్ గారే నిర్మాతనే అవ్వడం విశేషం.విడుదలైన అన్నీ కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకొని, 17 థియేటర్స్ లో 175 రోజులు ఆడింది.హైదరాబాదులోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లో ఓడియన్ 70 mm లో 205 రోజులు పూర్తి చేసుకుంది.

మొదటి సినిమాతోనే నటనలో మంచి మార్కులు సంపాదించుకున్న రామ్ కి ఆ తర్వాత వచ్చిన ఏ సినిమాలోనైన ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా నటనలో రామ్ మైనస్ కాలేదని చెప్పొచ్చు.
ఆర్య సినిమాతో అఖండ విజయం అందుకున్న డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో జగడం సినిమా చేశారు,అది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది కానీ రామ్ కి మాత్రం మాస్ లో ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందనే చెప్పాలి.

ఇక మూడో సినిమా శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసారు, అవుట్ & అవుట్ కామెడీ ఆండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయి ఫ్యామీలి ప్రేక్షకులను సంపాదించుకున్నారు. వందరోజులు ఆడిన ఆ సినిమా పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.


బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన మస్కా సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదల అయి హిట్ గా నిలిచి మరో విజయాన్ని రామ్ ఖాతాలో వేసింది. పక్కా కమర్షియల్ సినిమాగా వచ్చిన ఈ చిత్రంలో రామ్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

ఆ తర్వాత వచ్చిన ‘జస్ట్ గణేష్ , రామ రామ కృష్ణ కృష్ణ ‘ యావరేజ్ గా నిలిచాయి.
2011 లో నూతన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ కందిరీగ ‘ మళ్ళీ రామ్ కు రెడీ సినిమా రేంజ్లో హిట్ ఇచ్చింది.ఫుల్ లెంగ్త్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమతోనే రామ్ స్టార్ హీరో అయ్యారు.
ఆ తర్వాత ప్రేమకథ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో చేసిన సినిమా ‘ ఎందుకంటే ప్రేమంట ‘, ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ అలరించింది.

‘ఒంగోలు గిత్త ,మసాలా, పండుగ చేస్కో , శివమ్ ‘ సినిమాలు కమర్షియల్ గా యావరేజ్ గా ఆడాయి. 2016 కొత్త సంవత్సరం కానుకగా వచ్చిన ‘నేను శైలజా’ సినిమా రామ్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్ అయి సినిమా విజయంలో భాగం అయింది.
ఆ తర్వాత వచ్చిన ‘హైపర్, ఉన్నది ఒకటే జిందగీ,హలో గురూ ప్రేమకోసమే’ ఒక తరహా ప్రేక్షకులను అలరించాయి.

దేవదాసు, రెడీ,కందిరీగ, నేను శైలజ సినిమాలు ఈ ఎనర్జిటిక్ స్టార్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచాయి.సరిగ్గా నిన్నటి రోజు పదమూడు సంవత్సరాల క్రితం దేవదాసు విడుదలైంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: