రవితేజకు థ్యాంక్స్ చెప్పిన హరీష్ శంకర్!

కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు మాస్ రాజా రవితేజ గారు అలా వచ్చిన వాళ్ళ లిస్ట్ చెప్పాలంటే చాలా పెద్దదే,ఆ లిస్ట్ లో వారైన ఒకరు హరీష్ శంకర్.రవితేజ గారి గత సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసిన హరీష్ శంకర్ కు అవకాశం ఇస్తూ షాక్ రూపంలో ఒక సినిమా చేసారు,అది ఇద్దరికీ షాక్ ఇచ్చింది. ఆ షాక్ లో ఉన్న దర్శకుడు కోలుకోవడానికి చాలా సమయం పట్టింది కారణం మళ్ళీ దర్శకత్వశాఖలో పనిచేయడం.

హరీష్ శంకర్ రెండో సినిమాకి మళ్ళీ రవితేజ గారే అవకాశం ఇచ్చారు, షాక్ తర్వాత వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమా మిరపకాయ్.సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీక్షా సేత్, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. అభిమానులు కోరుకున్న రవితేజ ఇందులో కనిపిస్తారు, ఆద్యంతం వినోదం పాటు యాక్షన్ & రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమా తెరకెక్కింది.

సరిగ్గా ఈ సినిమా వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయినందున హరీష్ శంకర్ ఈ సందర్భంగా రవితేజ గారికి ట్విట్టర్ ద్వారా మరొక సారి మాస్ రాజా రవితేజ అన్నయకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను,మీరు నన్ను నమ్మిన నమ్మకమే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడడానికి కారణం అయింది,ఒక్క థ్యాంక్స్ తో సరిపోనిది అన్నట్లుగా వెల్లడించారు.ఇప్పటికీ చాలా సార్లు జన్మ పున:జన్మ రవితేజ గారే ఇచ్చారు అని చెప్పారు హరీష్ శంకర్.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.