సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల పై మహేష్ బాబు ప్రశంసలు..!

గత సంక్రాంతి కంటే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వద్ద సినిమాలతో గట్టి పోటీ నెలకొంది,వరుసగా నాలుగు రోజులతో నాలుగు సినిమాలు విడుదలై తెలుగు వారి పండుగలో మరింత ఉత్సహాన్ని నింపాయి.ఆ సినిమాల ఫలితం ఏంటో మనకు తెలిసిందే, ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్ లో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమాల పై ట్విట్టర్ ద్వారా ప్రశంసల జల్లు కురిపించారు.

ఎన్.టి.ఆర్ కథానాయకుడు గురించి చెప్తూ డైరెక్టర్ క్రిష్ గారు ఈ సినిమాని అధ్బుతమైన పెయింటింగ్ లా తీర్చారు, ఇక బాలకృష్ణ గారు పూర్తిగా ఎన్.టి.ఆర్ గారిలా మారిపోయి ఆ పాత్రకి జీవం పోశారు.మిగిలిన పాత్రలన్ని కూడా బ్రిలియంట్ గా ఉన్నాయని చెప్పారు.ఎవరైతే ఈ సినిమాని చూసారో రెండో భాగం కూడా చూడ్డానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.

ఇక ‘పేటా’ సినిమా గురించి చెప్తూ, పేటా రజినీకాంత్ సార్ అభిమానులందరికీ నాతో సహా మంచి విందు లాంటి సినిమా,ఒకే మాట ‘తలైవా’ సూపర్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బారాజ్ మాకున్న మంచి టాలంటెడ్ డైరక్టర్లలో ఒకడివి అంటూ యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పారు.

F2 గురించి చెప్తూ, సినిమా చూసాను వెంకీ సర్ తన పాత్రలో ఒదిగిపోయి కామెడీ టైమింగ్ తో అధ్బుతంగా చేసారు,అలాగే వరుణ్ తేజ్ కూడా ఉల్లాసంగా ఇంక వెంకీ సర్ టైమింగ్ కి సమానంగా చేసారు.డైరెక్టర్ గురించి చెప్తూ మరో సారి డైరెక్టర్ అనిల్ రావిపూడి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు,దర్శకులకి నిర్మాత దిల్ రాజు గారికి మొత్తం టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇలా మహేష్ బాబు గారు ట్వీట్ చేసి అభినందించడం కొత్తేమీ కాదు సోషల్ మీడియా లేని టైంలో కూడా ఆయా సినిమాలను అభినందించేవారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: