19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కహో నా ప్యార్ హే!

‘కహో నా ప్యార్ హే’ ఈ సినిమా పేరు చెప్తే చాలు ఈ సినిమాతో జరిగిన మ్యాజిక్ గురించి రకరకాలుగా చెప్తారు బాలీవుడ్ ప్రేక్షకులు.ఫిల్మ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ లో రాకేష్ రోషన్ నిర్మాతగా ఇంక అతని దర్శకత్వంలోనే వచ్చిన ఈ సినిమా ఈ రోజుతో 19 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ సినిమాతోనే హృతిక్ రోషన్, అమిషా పటేల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు,ఇంక వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే మాములుగా ఆకట్టుకోలేదు. హృతిక్ రోషన్ అయితే రోహిత్, రాజ్ రెండు పాత్రల్లో నటించి అమ్మాయిల హృదయాల్ని దోచుకున్నాడు, కండల వీరుడిగా కలల రాకుమారుడిగా మారాడు.డాన్సుల్లో,ఫైట్స్ లో ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెంస్ తో నటనతో ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యారు.

సరికొత్త కథ,కథనాలతో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.2000 సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా చరిత్రను సృష్టించింది,పెట్టిన బడ్జెట్ కి ఎనిమిదింతలు రాబట్టి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది.
రవికపూర్,హనీ ఇరానీ అందించిన స్క్రీన్‌ప్లే సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక రాజేష్ రోషన్ సంగీతం అయితే కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది, అన్నీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా టైటిల్ సాంగ్ ఏక్ పల్ కా జీనా,చాంద్ సితారే పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.

దాదాపు అన్నీ క్యాటగిరిల్లో పలు రకాల అవార్డులను సొంతం చేసుకుంది, అందులో ఎక్కువ సంఖ్యలో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది.బాలీవుడ్లో అధిక సంఖ్యలో అవార్డులను పొందిన చిత్రంగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ‘ లో పేరు పొందింది.2002 లో సైతం ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ‘ లోను పేరొందింది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: