19 సంవత్సరాల కలిసుందాం రా..!

పండుగ పూట మంచి సినిమా వచ్చిందంటే ఆ థియేటర్లో పండుగ పూట పండుగ వాతావరణం ఏర్పడుతుంది. మరి అలాంటి పండుగకి అంతకుమించి పండుగ లాంటి సినిమా వస్తే మరింకేం అయిన ఉందా థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారు.

సురేష్ ప్రొడక్షన్స్ లో డి.సురేష్ బాబు నిర్మాతగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, సిమ్రాన్ కలయికలో వచ్చిన సినిమా ‘కలిసుందాం రా ‘ 2000 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు విడుదలైంది. అసలు సిసలైన పండుగ టైంలో పండుగ లాంటి సినిమా ఈరోజు తో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బంధాలు బంధుత్వాల మధ్య అద్దం పట్టే కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. కొత్తగా ఈ సినిమా గురించి చెప్పేదేం లేదు,వెంకటేష్,సిమ్రాన్ ల బావ మరదలుగా వాళ్ళ కెమిస్ట్రీ తెర మీద బాగా ఆకట్టుకుంది, అంతేకాకుండా వాళ్ళ లవ్ ట్రాక్ కూడా కుర్రకారుని ప్రేమలో ముంచెత్తింది.

ముఖ్య పాత్రల్లో చేసిన కె.విశ్వనాథ్, శ్రీ హరి,రంగనాథ్, రాళ్ళ పల్లి పాత్రలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి.పరుచూరి బ్రదర్స్ అందించిన మాటలు సినిమా విజయంలో భాగం అయ్యాయి,యస్.ఏ రాజ్ కుమార్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, అన్నీ పాటలు సూపర్ హిట్ అయ్యాయి ముఖ్యంగా నేపథ్య సంగీతం .

2000 సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది,ఆ పై ఇలాంటి సినిమాలు మరిన్ని రావడానికి దోహదపడింది.1999 లో వచ్చిన సమరసింహారెడ్డి రికార్డ్‌లను సైతం బ్రేక్ చేసి 70 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రను తిరగరాసింది.103 సెంటర్లలో వందరోజులు ఆడగా,35 సెంటర్లలో 175 రోజులు,20 సెంటర్లలో 200 రోజులు రన్ అయి ఆల్ టైం హిట్ గా నిలబడింది. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా దాదాపు 20 కోట్ల వరకు వసూల్ చేసింది.

పలు క్యాటగిరిల్లో పలు అవార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమా,ఆ తర్వాత హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయింది. ఫలితం ఎలా ఉన్న ఇప్పటికీ ఇలాంటి కథలతో సినిమాలు వస్తూ పోతున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.