రెండవ షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్..!

యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా జక్కన దర్శకత్వంలో చేస్తున్న మల్టీస్టారర్ గురించి అందరికీ తెలిసిందే. గత నెలలోనే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండో షెడ్యూల్ కు రెడీ అవుతుంది,రాజమౌళి గారు తన కుమారుడి వివాహంతో, రామ్ చరణ్ వివిఆర్ సినిమా కోసం కాస్త బ్రేక్ ఇచ్చారు,ఇక తిరిగి ఈ నెల 21 నుంచి ఈ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ లో ఇద్దరు హీరోలు పాల్గొననున్నారు.

పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పై ప్రముఖ నిర్మాత డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఒకే సారి తెలుగు,హిందీ, తమిళం, మలయాళంలో వచ్చే ఏడాది విడుదల కానుంది. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మిగితా తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: