వర్షం సినిమాకి 15 సంవత్సరాలు…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో వర్షం సినిమా చాలా ముఖ్యమైనది, ఈ సినిమా ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో అందరికీ తెలిసిందే.సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై యం.యస్ రాజు నిర్మాతగా శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుక 2004 లో జనవరి 14 న విడుదలై, మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్,త్రిష ల కెమిస్ట్రీ సినిమాకే హైలట్ అయింది,పూర్తి స్థాయి ప్రేమ,వినోదంతో పాటు యాక్షన్ ఎంటర్టైనర్ గా సంక్రాంతి రేసులో నిలబడింది.ఇక దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం సినిమాకి సమానంగా విజయం పొందింది, అన్నీ పాటలు సూపర్ హిట్ అవ్వగా,నువ్వొస్తానంటే నేనొద్దంటానా,మెల్లగా కరగని పాటలు అయితే ఒక స్థాయిలో ఉర్రూతలూగించాయి. వీరు పోట్ల,యం.యస్ రాజు అందించిన కథ-స్క్రీన్ ప్లే కి దర్శకుడు న్యాయం చేసారు, పరుచూరి బ్రదర్స్ రచన సినిమాకి ప్లస్ అయింది.ఇక ప్రతినాయకుడిగా చేసిన గోపిచంద్ భద్రన్న పాత్రలో పవర్ ఫుల్ గా నటించి ఆకట్టుకున్నారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా పాటకి ఉత్తమ గాయనిగా కె.యస్ చిత్ర, ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా,ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా మధుసూదన్ రెడ్డి గారు నంది అవార్డులను పొందారు.
ఇక 52వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రానికి,ఉత్తమ నటుడికి,ఉత్తమ నటికి, ఉత్తమ విలన్ కి,ఉత్తమ సంగీత దర్శకుడికి,ఉత్తమ గాయని(కె.యస్ చిత్ర),ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (యస్.గోపాల్ రెడ్డి) కి గాను అవార్డులు వచ్చాయి. ఇంక సినీ మా అవార్డ్స్ తో పాటు సంతోషం అవార్డ్స్లను ఇంచుమించు ఈ సాంకేతిక వర్గాలే అందుకున్నారు.

తెలుగులో ఇంత ఘనవిజయం అయిన ఈ సినిమా ఆ తర్వాత తమిళంలో,ఒడిశాలో చివరిగా హిందీలో రీమేక్ అయింది, కాగా తెలుగులో 200 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకొని,79 సెంటర్లలో 100 రోజులు ఆడింది.ప్రభాస్ కి మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు శోభన్ 2008 లో కార్డియాక్ అరెస్టు తో ఆకస్మికంగా మరణించారు. ఆయన కెరీర్‌లో వర్షం కంటే ముందు మహేష్ బాబుతో బాబీ,వర్షం తర్వాత రవితేజ తో చంటి సినిమాలు చేశారు.

%d bloggers like this: