అవును అతనో చరిత్ర. అందరు తెలుసుకోవాల్సిన చరిత్ర..

Article Contributed By :Vijay Peddakotla

జార్జ్ రెడ్డి.. చాలామంది సామాన్య ప్రజలకు అంతగా తెలియని పేరు, గత సంవత్సర క్రితం వరకు నాకు కూడా. నంది అవార్డ్ విన్నర్ Raj Madiraju సర్ దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా అప్పుడే జాయిన్ అయిన సందర్భం.. రొటీన్ సినిమాలకు భిన్నంగా, ఏదైనా చేయాలని వారు అనుకున్నారు. సొంత నిర్మాణంలో తెలుగులోనే కాకుండా కొన్ని బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలను నిర్మించాలని ఒక సంస్థను నెలకొల్పారు. రాజ్ సర్ తన దగ్గర ఉన్న కొన్ని బేసిక్ లెవెల్ ఐడియాస్ ని మాకు చెప్పారు. వాటి మీద రీసెర్చ్ చేసి డెవెలప్ చేయడం మా వర్క్. వాటిలో నాకు కొన్ని నార్మల్ గా అనిపించాయి. కొన్ని మాత్రం అద్భుతంగా ఉన్నాయి. వాటిలో ఒకటి మన జార్జ్ రెడ్డి. అతని గురించి అతని కథ గురించి సర్ చెప్తున్నప్పుడే రోమాలు నిక్కపొడ్చుకున్నాయి. ఇక మా పని మొదలైంది.

అసలెవరీ జార్జ్ రెడ్డి అని అతని గురించి పూర్తిగా తెలుసుకోవడం మొదలు పెట్టాను. చరిత్ర. అవును అతనో చరిత్ర. ఆనాడు యువతరాన్ని స్ఫూర్తివంతగా చైతన్యపరచి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి. అతని గురించి రీసెర్చ్ చేస్తున్నపుడు అతని కథలో జరిగిన ప్రతి సంఘటన ఒక అద్బుతమే. అతని ధైర్యం, అతని ప్రతిభ, అతని అలుపెరగని పోరాటం, అన్నీ అతనిని ఒక గొప్ప వ్యక్తిగా నిలిపాయి. విద్యార్థుల కోసం, ప్రజల కోసం పోరాడాడు జార్జ్. అదే ధైర్యం, తెగువతో ముందుకు కదిలాడు. 25 ఏళ్లకే హత్య కాబడ్డాడు జార్జ్.

యువ సినిమాలో మణిరత్నం జార్జ్ భావజాలంతో ప్రధాన పాత్రని రూపొందించాడు. కానీ అందులో మీరు చూసింది కేవలం సాంపుల్ మాత్రమే. జార్జ్ ని పూర్తిగా తెలుసుకోవాలంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంకి వెళ్ళండి.. అతని జ్ఞాపకాలన్ని అక్కడే. విప్లవం అక్కడే మొదలైంది. చాలా ఉంది. అతని జీవితం గురించి ఇలా కొన్ని ముక్కల్లో చెప్పలేం. సినిమా వస్తుందిగా చూసేయండి.

Infact జార్జ్ బయోపిక్ రాజ్ సర్ సొంత నిర్మాణంలో చేయాలని అనుకున్నాం. కానీ అంతలోనే ఆ సినిమా వేరే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారని తెలిసంది. ఒక గొప్ప చిత్రాన్ని.. కాదు కాదు జీవితాన్ని మీకు చూపించే అదృష్టం చేజారినందుకు ఒకింత బాధగానే ఉంటుంది, ముఖ్యంగా రాజ్ సర్ కి. బట్ స్టిల్, అతని బయోపిక్ తీయాలని భావించి అందులో పనిచేసే అవకాశం దొరికి జార్జ్ గురించి తెల్సుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. దళం డైరెక్టర్ జీవన్ రెడ్డి జార్జ్ చిత్రాన్ని తీస్తున్నారని తెలిసింది. జీవన్ అన్న ఆల్ ది బెస్ట్. గొప్ప సినిమా తీయబోతున్నావ్. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది. అతని గురించి తెలుసుకునే క్రమంలోనే అతని భావజాలం, అతని ధైర్యానికి నచ్చి ఫిదా అయిపోయిన. జోహార్ జార్జ్ రెడ్డి.

“జీనా హై తో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్నా సీఖో..” – జార్జ్ రెడ్డి

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: