భారీ సీక్వెల్ కు రంగం సిద్ధం అయ్యింది..!

కమల్ హాసన్-శంకర్ కలయికలో 1996 లో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు.ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ఇండియన్-2 పేరుతో భారీ హంగులతో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కమల్ వేళ్ళని మడతపెట్టిన స్టైల్ నెటిజన్లు ఆకట్టుకుంది, ఇక రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుందని టెక్నాలజీ మాంత్రికుడు శంకర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. కమల్ హాసన్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్,తమిళ స్టార్ శింబు ప్రత్యేక పాత్రల్లో,వెన్నెల కిషోర్ కెమీయో పాత్రలో నటించనున్నారు.యంగ్ టాలంటడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Watch Bharateeyudu Full Movie Here..