ఎస్.ఎస్ రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి యే!

ఇప్పటికీ వరకు అపజయం తెలియని తెలుగు దర్శకులు ఎవరనీ ఎవర్నీ అడిగిన సందేహం లేకుండా ఎస్.ఎస్ రాజమౌళి గారి పేరే చెప్తారు. స్టూడెంట్ నెం.1 నుంచి బాహుబలి వరకు అన్నీ సూపర్ హిట్స్ తో పాటు కొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి ఒక్కటి కూడా ఫ్లాప్ లేదు. రాజమౌళి గారు గత 18 సంవత్సరాల నుండి ఉన్నారు,అగ్ర స్థాయికి చేరుకున్నారు.

ఇక రాజమౌళి గారి తర్వాత ఆ విధంగా వరుస సూపర్ హిట్స్ తో ఎవరూ లేరని నిర్మోహమటంగా చెప్పొచ్చు. కొత్త దర్శకులు వచ్చిన ఒకటి రెండు సినిమాలతో హిట్స్ అందుకున్న ఆ తర్వాత అపజయం రుచి చూసారు. కానీ 2015 లో పటాస్ తో ప్రస్థానం మొదలుపెట్టిన అనిల్ రావిపూడి మాత్రం వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నారు తీసుకున్న కథలు పాతవే అయిన ప్రెజెంటేషన్ మాత్రం కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే ని డీల్ చేసే విధానం కానీ,ఆ తరహా ట్రీట్మెంట్ కానీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అవుతుంది.

పటాస్,సుప్రీమ్,రాజా ది గ్రేట్ ఆద్యంతం వినోద భరితంగా సాగుతూ కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి, ఇక మొన్న వచ్చిన F2 కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విన్నర్ గా నిలబడింది. ఈ విధమైన సక్సెస్ రేట్ ఈ మధ్య కాలంలో అనిల్ రావిపూడికి మాత్రమే ఉందని చెప్పొచ్చు, కాబట్టి రాజమౌళి గారి తర్వాత అనిల్ రావిపూడి యే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: