
హాస్యబ్రహ్మానికి హార్ట్ సర్జరీ అయ్యింది..!
తెలుగు తెర మీద ఎప్పుడూ నవ్విస్తూ తిరుగులేని అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం.ప్రతి సినిమాలో తనదైన శైలిలో నవ్వులు పూయించిన బ్రహ్మానందం గారు అకస్మాత్తుగా అనారోగ్యం గురైయ్యారు.ఇటీవలే ముంబై వెళ్లిన ఆయనకు అక్కడే అనారోగ్యానికి గురవ్వడం వల్ల ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ బ్రహ్మానందం గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని చెప్పగా కావాల్సిన హార్ట్ సర్జన్ డాక్టర్ సలహా మీద మేరకు కుటుంబ సభ్యుల అనుమతి మీద ప్రముఖ డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో హార్ట్ సర్జరీ చేశారు.ప్రస్తుతం బ్రహ్మానందం గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.