క్యాన్సర్ ఫ్రీతో సంతోషంగా ఉన్న రొమాంటిక్ హీరో.!
బాలీవుడ్ రొమాంటిక్ హీరోల్లో ఇమ్ రాన్ హష్మీ ఒకరు.జహేర్,మర్డర్,అక్సర్,ఆవారపన్, తదితర సినిమాలతో కిస్సింగ్ స్టార్ గా ఒకరకమైన పేరుంది.ఈ రొమాంటిక్ హీరో పదమూడేళ్ళ క్రితం పర్వీణ్ శహ్హనీ ని ప్రేమ వివాహం చేసుకున్నారు.2010 లో వీరికి ఒక కొడుకు పుట్టాడు, పేరు అయాన్.కొడుకు పుట్టిన ఆ సంతోషం ఎంతో కాలం లేదు,అయాన్ పుట్టిన రెండేళ్ళకే క్యాన్సర్ బారీన పడ్డాడు దాంతో ఈ విషయం అయి ఇంరాన్ ఎంతో కృంగి పోయాడు.అసలు తప్పు ఎక్కాడ జరిగిందనీ లోతుగా ఆలోచించి దీని గురించి ముందు జాగ్రత్తగా వేరే వాళ్ళకి ఉపయోగపడేలా ఒక పుస్తకం రాద్దామని సిద్ధం అయ్యాడు, పుస్తకం పేరు వచ్చేసి ‘ది కిస్ ఆఫ్ లైఫ్’.

ఐదు సంవత్సరాల నుంచి తన కొడుకు క్యాన్సర్ తో పోరాడి ఇప్పుడు జయించాడు,ఇక క్యాన్సర్ ఫ్రీ అని డాక్టర్లు తేల్చి చెప్పేయడంతో సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మీ ప్రార్ధనలు,విషెస్ నా కొడుకు ఆరోగ్యానికి పని చేశాయని కృతజ్ఞతలు చెప్పారు.
