మరోసారి చైతు,సమంతల కెమిస్ట్రీ అదిరిపోనున్నందట..!

యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి.వీళ్ళిద్దరిది పర్ఫెక్ట్ కెమిస్ట్రీ అని ఆ మూడు సినిమాలే నిరూపించాయి,కాగా ప్రస్తుతం ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ‘మజిలీ’ సినిమాలో మరోసారి జతకడుతున్నారు.రొమాంటిక్ సన్నివేశాలే ఈ సినిమాలో హైలేట్ అవనున్నాయంట, ఈ సినిమాలో కూడా చై, సమంతల కెమిస్ట్రీ ఇంకో కోణంలో ఉండనుందని సమాచారం.

1990 నాటి ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుండగా భార్యభర్తల మధ్య అనుబంధ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో సమంత ఓ రైల్వే ఉద్యోగిగా కనిపించనుంది, ఇక నాగచైతన్య రెండు గెటప్స్ కనిపించనున్నారు ఒకటి సినిమాలో పెళ్లికి ముందు ఇంకోటి పెళ్లికి తర్వాత,ఇక ఇప్పటికే ఈ సినిమా సగం షూటింగ్‌ దాదాపు పూర్తయింది. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు, వేసవి కానుకగా ఏప్రిల్‌లో విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: