వాయిదా పడిన మహానాయకుడు…!

నట విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఎన్.టీ.ఆర్’, అందులోని మొదటి భాగం ‘కథానాయకుడు’ గత వారం విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది, అయినప్పటికీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా చాలా వెనుకబడిపోయింది.ఈ చిత్రం బాగా స్లోగా సాగడం, అలాగే నిడివి కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రభావం కలెక్షన్ల మీద పడిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 7 న విడుదలవ్వాల్సిన రెండో భాగం ‘మహానాయకుడు’ ఒక వారం వెనక్కి వెళ్ళి పోయాడు.ఈ చిత్రం మీద యూనిట్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటుందంటా, సినిమాలో అవసరమైన ఇంక కావాల్సిన సన్నివేశాలు మాత్రమే పెట్టి వీలైనంత వరకు ఆకట్టుకునేలా చూస్తున్నారట ఇక పోస్ట్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన పనులు కూడా అనుకున్న సమయానికి అయ్యేలా లేదని కూడా ఒక కారణం అని చెప్తున్నారు. కీరవాణి సంగీత సమకూరుస్తూండగా ఎన్.బి.కె ఫిలింస్,వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మించారు వచ్చే నెల 14 న ఈ సినిమా విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: