రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన సెన్సేషన్ హీరో.!

గత ఏడాది ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో పరిచయం అయిన హీరో కార్తీకేయా. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది, చిన్న సినిమాగా వచ్చి కాసుల వర్షం కురిపించింది.ఈ సినిమాతో హీరో కార్తీకేయా టాలీవుడ్ సెన్సేషన్ హీరో అయ్యారు,హీరోయిన్ కూడా మంచి మార్కులు పడ్డాయి.ఇక హీరో కార్తీకేయా తన రెండో సినిమాని దాదాపు ఆరు నెలలు పలు కథలు విన్నాక ఈ కథను ఎంచుకొని ఈ మధ్యే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు, ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి ఒంగోలులో మొదలైంది.

ఒంగోలులో మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారంటా. జ్ఞానపిక ఎంటర్టైన్మెంట్స్ స్ప్రింట్ ఫిలింస్ పై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంతో నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల పరిచయం అవుతున్నారు. అర్జున్ జంధ్యాల ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను దగ్గర పదేళ్ళు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా అదే సినిమాకు కెమెరామెన్ గా చేసిన రామ్ యే ఈ సినిమాకు పని చేస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: