
సక్సెస్ మీట్ కి సిద్ధమైన ఎఫ్2 టీం..!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన మల్టీసారర్ ‘ఎఫ్2’. సంక్రాంతి బరిలో దిగిన మూడు సినిమాల్లో ఎఫ్2 ఘనవిజయం సాధించింది, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్స్ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు సక్సెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకొని ఈ రోజు(జనవరి 18న) సాయంత్రం 6 గంటల నుండి ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది అని చెప్పారు. తమన్నా,మెహరీన్ హీరోయిన్లుగా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.ఇక అనిల్ రావిపూడి ఈ సినిమాతో దిల్ రాజు గారి కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టారు.