’96’ తెలుగు రీమేక్ అప్డేట్స్…!

ఇటీవలే (గత ఏడాది) తమిళంలో సంచలన విజయం సాధించిన సినిమా ’96’, ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాని మద్రాస్ ఎంటర్ర్పైజేస్ పతాకంపై ఎస్.నంతగోపాల్ నిర్మించారు. ఇక విడుదల కంటే ముందే ప్రత్యేకంగా చూసిన దిల్ రాజు ఈ సినిమా మీద మనస్సు పారేసుకున్నారు, తెలుగు డబ్బింగ్ హక్కులను కొనకుండా రీమేక్ హక్కులను కొని తనే నిర్మిస్తున్నట్లు గతంలో చెప్పారు. కొన్నాళ్ళు రకరకాలుగా రూమర్లు క్రియేట్ అయ్యాయి,ఆఖరికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి.

ఇక చివరికి ఈ సినిమా విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. శర్వానంద్, సమంత కలయికలో ఒరిజినల్ వెర్షన్నే తెరకెక్కించిన సి.ప్రేమ్ కుమారే ఈ సినిమాని రూపొందించనున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని ఇతర తారాగణం, సాంకేతిక వివరాలు అధికారికంగా చెప్పనున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: