KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

మిస్టర్ మజ్ను ప్రీ రిలీజ్ ఈవింట్ తో రెండో సారి కలవనున్న జూ.ఎన్టీఆర్‌, అఖిల్..!

Reading Time: 1 minute

ప్రస్తుతం అక్కినేని అఖిల్ చేస్తున్న మూడో సినిమా ‘మిస్టర్ మజ్ను’. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ ని గతనెలలో విడుదల చేశారు దాంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇటీవలే రిలీజైన పాటలు కూడా ఆకట్టుకుంటున్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుండంతో యూనిట్ సభ్యుల ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఈ నెల 19న ఫిలిం నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా జూ.ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఈ విషయం అయి ఈ సినిమా టీం పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు.

ఇక ఈ వేడుకతో జూ.ఎన్టీఆర్,అఖిల్ దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ లో కలవనున్నారు.2003 లో వచ్చిన ‘శివమణి’ ఆడియో ఫంక్షన్ లో ముఖ్య అతిధిగా జూ.ఎన్టీఆర్ వచ్చారు అప్పుడు అఖిల్ కి ఏడేళ్లు ఉంటాయి.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ గారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.