మన్మథుడు సినిమాకి సీక్వెల్ నిజమేనా..?

యువ సామ్రాట్ కింగ్ నాగార్జున గారి ఎవర్ గ్రీన్ సినిమాల్లో మన్మథుడు ఒకటి,16 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం బాక్స్ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. రొమాంటిక్ ప్రేమకథతో పాటు కామెడీకి ఏమాత్రం లోటు లేకుండా వచ్చిన ఈ క్లాస్ ఎంటర్టైనర్ ఇప్పటికీ టీవిలో ప్రసారం అయిన దాన్ని కొత్తగా చూస్తాం.

ఇక ఎప్పట్నుంచో నాగార్జున గారికి కూడా ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఉందని పలు సార్లు చెప్పారు, అలాగే ఈ మధ్యే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసారు.

చి.ల.సౌ సినిమాతో మెప్పించిన యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సీక్వెల్ ని తెరకెక్కించనున్నారు,ఈ మధ్యే సినిమాకు సంబంధించి స్క్రిప్టు ను కూడా నాగార్జున గారు విని థ్రిల్ ఫీల్ అయ్యారట, గతంలో మన్మథుడు 2 పేరుతో టైటిల్ రిజిస్టర్ చేయించిన విషయం తెలిసిందే.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు,ఈ సినిమాతో పాటు ‘సోగ్గాడే చిన్ని నాయన ‘ సినిమా సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు నాగ్ మరి ముందు ఏ సీక్వెల్ స్టార్ట్ అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: