మెగాస్టార్ క్లాప్ తో ప్రారంభం అయిన వైష్ణవ్ తేజ్ సినిమా..!

మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినీరంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ రోజు ఉదయం 9 గంటలకు రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్,అల్లు అర్జున్,వరుణ్ తేజ్,సాయి ధరమ్ తేజ్,నాగబాబు,అల్లు అరవింద్ ఇలా మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యారు.

పూజా కార్యక్రమాల అనంతరం చిరంజీవి గారు మొదటి క్లాప్ కొట్టగా,అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు,అల్లు అర్జున్,వరుణ్ తేజ్, నాగబాబు స్క్రిప్ట్ ను దర్శకనిర్మాతలకు అందించారు.ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ ‘మైత్రీ మూవీ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ ‘ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి, ఇలా రెండు ప్రతిష్ఠాత్మక సంస్థ ద్వారా వైష్ణవ్ తేజ్ తెలుగు తెరకు పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది.

ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని వైష్ణవ్ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను, ఇక దర్శకుడిగా పరిచయం అవుతున్న బుచ్చిబాబు సానా రంగస్థలం సినిమాకి రచయితగా పనిచేసారు ఈ సినిమా కూడా అదే తరహాలో ఎమోషన్ల్ వాస్తవిక కథతో తెరకెక్కనుందని చెప్తూ చిత్ర బృందానికి తన ఆశీస్సులను అందించారు.

వైష్ణవ్ తేజ్ తో పాటు హీరోయిన్‌గా మనీషా రాజ్ పరిచయం అవుతున్నది.ఇక దర్శకుడిగా పరిచయం అవుతున్న బుచ్చిబాబు సాన ప్రముఖ దర్శకులు సుకుమార్ గారి దగ్గర మొదటి నుండి దర్శకత్వ శాఖలో అసిస్టెంట్ గా అసోసియేట్ గా ఈ మధ్యే వచ్చిన రంగస్థలం సినిమాతో రైటర్ గా మారారు.

త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా,శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.
మిగితా తారాగణం మరియు ఇతర సాంకేతిక వివరాలు అతిత్వరలో అధికారికంగా తెలియనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.