వరుసగా రెండు సినిమాలతో నితిన్ బిజీ…!

ప్రస్తుతం హీరో నితిన్ జోరు పెంచారు శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత దాదాపు 5 నెలలు గ్యాప్ తీసుకొని ఇప్పుడు వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.’ఛలో’ ఫేం వెంకీ కుడుముల తో భీష్మ సినిమా చేస్తుండగా ‘కరెంట్, కుమారి 21F’ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ తో ఒక సినిమా చేస్తున్నారు.

వివరాల్లోకెళితే, ‘ఛలో ‘ సినిమాతో కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్నారు నూతన దర్శకుడు ‘వెంకీ కుడుముల ‘ ఆద్యంతం వినోదం తో కూడిన ఆ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. వెంకీ కుడుముల త్రివిక్రమ్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో కొన్ని సినిమాలకు పని చేసారు, ‘అఆ’ సినిమా సమయంలో నితిన్ కి ఈ దర్శకుడికి మధ్య సన్నిహితం ఒకటి కారణం అయితే ఛలో లాంటి హిట్ సినిమా తీయడం ఒక కారణం అయింది.

ఏదేమైనా ఈ సినిమా కూడా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గానే తెరకెక్కనుందని సమాచారం. నితిన్ సరసన రష్మీక మండన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారం నుండి మొదలు కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

కుమారి 21F తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ ప్రముఖ దర్శకులు సుకుమార్ గారి దగ్గర రచయితగా పనిచేశారు.ఈ కాంబినేషన్ మార్చి చివర్లో మొదలైయ్యే అవకాశాలు ఉన్నాయి.మిగితా పూర్తి వివరాలు తెలియనున్న ఈ సినిమాని బన్ని వాసు నిర్మించనున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.