డైరెక్టర్ సినిమా రిలీజ్ కు ముందే మరో సంస్థలో ఆఫర్…!

గత సంవత్సరం ‘ తొలిప్రేమ ‘ సినిమాతో దర్శకుడిగా మారారు హీరో వెంకీ అట్లూరి,యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసింది. ఇక ‘ ఫిదా ‘ తర్వాత వరుణ్ తేజ్ కు ఆ స్థాయి విజయాన్ని అందించింది.ఆ వెంటనే వెంకీ అట్లూరి అక్కినేని అఖిల్ తో రెండో సినిమా(మిస్టర్ మజ్ను) మొదలుపెట్టారు,ఈ సినిమా కూడా పూర్తయి ఈ నెల 25న విడుదలకు సిద్ధం అవుతుంది, ట్రైలర్ చూస్తూంటే
ఇది కూడా యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ లా కనిపిస్తుంది.

ఏ దర్శకుడికైనా తన ప్రస్తుత సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ తర్వాతి సినిమాకి నిర్మాత దగ్గర్నుంచి ఆఫర్ వస్తుంది.ఇంక మిస్టర్ మజ్ను రిలీజే కాలేదు అప్పుడే వెంకీ అట్లూరికి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అవకాశం వచ్చినట్లు కనిపిస్తుంది.ప్రస్తుత సినిమా విడుదలకు ముందే మరో ప్రొడక్షన్ హౌస్‌ లో సినిమా ఓకే అవ్వడం ఆ డైరెక్టర్ లో ఉన్న ఆ నమ్మకం,టాలెంట్ యే కారణం అనిపిస్తుంది.మిస్టర్ మజ్ను విడుదల తర్వాతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది,పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: