లవర్స్ డే కోసం స్టైలిస్టార్ అల్లు అర్జున్…!

ఈ మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు ఎక్కువగా అటెండ్ అయిన వాళ్ళలో అల్లు అర్జున్ గారి పేరు ముందుందని చెప్పొచ్చు.కొన్ని సార్లు హీరోలు గురించో లేక డైరెక్టర్ గురించో లేక ఆయా ప్రొడక్షన్ హౌస్ మీద అభిమానంతోనూ వెళ్లి ఆ సినిమా యూనిట్ కి మంచి బూస్టప్ ఇచ్చారు,కానీ ఈ సారి ఒక సెన్సేషన్ హీరోయిన్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా రానున్నారు.

గత ఏడాది ‘ఒరు ఆధార్ లవ్ ‘ సినిమాలోని టీజర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయింది, కారణం ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘ప్రియ ప్రకాష్ వారియర్ ‘ తన కను సైగలతో ఒక్క కన్ను కొట్టి కుర్రాలకి నిద్ర లేకుండా చేసింది.

గూగుల్ ట్రెండ్స్ లోనే టాప్ వన్ లో ఉందంటే ఆమె గురించి ప్రపంచం అంతా ఎలా ఆరాటపడిందో ఊహించవచ్చు.

ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మలయాళం తో పాటు తెలుగులోను ఈ సినిమా ఒకేరోజు విడుదల కానుంది. ఈ నెల 23న తెలుగు వెర్షన్ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని ఫిలిం నగర్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనుంది, ఇక ముందు చెప్పినట్లు గానే స్టైలిస్టార్ అల్లు అర్జున్ గారు ఈ చిత్ర బృందం ప్రత్యేక ఆహ్వానంతో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఈ విషయమై చిత్ర బృందం పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది,సుఖీభవ సంస్థ ఈ సినిమాని ‘లవర్స్ డే ‘ పేరుతో విడుదల చేస్తుంది. ఒమర్ లులు తెరకెక్కించిన ఈ సినిమాకి షాన్ రెహమాన్ సంగీతం అందించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: