త్వరలో సెట్స్ మీదకు భారీ క్రేజీ కాంబినేషన్..!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి రకరకాలుగా రూమర్స్ క్రియేట్ అయ్యాయి.అంత పుకార్లుగా వినిపించాయి,ఈరోజుతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టేయోచ్చు. ఈ భారీ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది,కొరటాల శివ గారు చెప్పిన స్క్రిప్ట్ చిరంజీవి గారికి బాగా నచ్చిందంట,మెగాస్టార్ గారి బాడీలాంగ్వేజ్ కి ఏమాత్రం తగ్గకుండా మంచి సోషల్ మెస్సెజ్ ఉన్న సబ్జెక్టు ఉండడంతో ఈ స్క్రిప్ట్ ని లాక్ చేసారని తెలిసింది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్స్ పనులు కూడా చివరాఖరుకు వచ్చాయి, కొణిదెల ప్రొడక్షన్స్ లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారు.

ప్రస్తుతం చిరంజీవి గారు స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడుతోంది.ఈ ఏడాది ఆగష్టు 15న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: