అధికారికంగా ప్రకటించిన మహర్షి రిలీజ్ డేట్..!

మహేష్ బాబు,వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మహర్షి ‘,ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఏప్రిల్ 5 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు, అయితే ఇటీవలే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమే అని సినీ వర్గాలు చెప్పాయి.ఇప్పుడు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు, అదే ఏప్రిల్ నెలలో 25 న బ్రహ్మాండంగా విడుదల కానుంది.

ఇక మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుండగా ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు,దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని అశ్వినిదత్, దిల్ రాజు,పి.వి.పి వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: