పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాని కొన్న స్టార్ మా….!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైల్ స్టోన్ గా నిలిచిన సినిమా ‘ తొలిప్రేమ ‘.ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన ఈ చిత్రం తెలుగు చలనచిత్రలో కొత్త రికార్డులను సృష్టించింది.కరుణాకరన్.ఎ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎస్.ఎస్.సి ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి రాజు నిర్మించారు.

పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. దేవా సంగీతం అందించిన పాటలు అప్పటికీ ఇప్పటికీ సరికొత్త ట్రెండే. పవన్ కళ్యాణ్ ని స్టార్ ని చేసిన ఈ సినిమా కోసం అప్పట్లో టికెట్ల కోసం కుర్రాళ్ల చొక్కాలు చినిగిపోయిన మధుర జ్ఞానపకాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో ప్రసారమైన చూస్తూ అతుక్కుపోతాం, అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ స్టార్ మా కొన్నది.

పదేళ్ల క్రితం వరకు జెమిని టీవి టెలికాస్ట్ చేసేది, ఆ తర్వాత జీ తెలుగు కొని మరో అయిదారు సంవత్సరాలు టెలికాస్ట్ చేసింది, అయిన సరే ఇప్పటికీ టిఆర్పిలో రేటింగ్ బావుందని బుల్లితెర వర్గాల దగ్గర్నుంచి సమాచారం. మొత్తానికి ఈ బ్లాక్ బాస్టర్ ఎవర్ గ్రీన్ బొమ్మని స్టార్ మా కొనడం సంతోషకరమైన విషయమే, రిపీటేడ్ గా రెగ్యులర్ గా వేసిన సందర్భానుసారంగా ప్రసారం చేస్తారు. కొత్త సినిమాలైన, పాత సినిమాలైన వాటి శాటిలైట్ హక్కులను కొనడంలో స్టార్ మా శైలి ప్రత్యేకమైనది అని చెప్పాలి.ఇప్పటికే పలు పాత సినిమాలని కొని 90 వ సంవత్సరం ప్రేక్షకులను అలరిస్తుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.