KALKI HONEST TRAILER TRENDING IN YOUTUBE | MALLESHAM GOT GOOD RESPONSE FROM PUBLIC
Skip to content

హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మెగా హీరో..!

Reading Time: 1 minute

‌పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు హరీష్ శంకర్. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా మినహాయిస్తే సాయి ధరమ్ తేజ్ తో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘, అల్లు అర్జున్ తో ‘ డీజె ‘ ఇలా వరుస పెట్టి మెగా హీరోలతో సినిమాలు చేసారు.డిజె తర్వాత బాగా బ్రేక్ తీసుకున్న ఈ మాస్ డైరెక్టర్ సంవత్సరం క్రితం దాగుడు మూతలు అనే టైటిల్ తో శర్వానంద్, నితిన్ హీరోలుగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కాల్సింది ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.

2014 లో తమిళంలో సూపర్ హిట్ అయిన జిగర్తాండా ను రీమేక్ చేసేందుకు చాలా రోజుల నుండి సన్నాహాలు చేస్తున్నారు, ఈ మధ్యే స్ర్కిప్ట్ ని కూడా లాక్ చేసారని సమాచారం.ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,నాగశౌర్య హీరోగా,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రతినాయకుడిగా చేయనున్నారు.ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మొదలు కానున్న ఈ సినిమా,ఇతర తారాగణం తో పాటు సాంకేతిక వర్గాల వివరాలు ఆరోజే తెలియనున్నాయి.

గబ్బర్ సింగ్ తర్వాత మరో సారి రీమేక్ నే నమ్ముకున్న హరీష్ శంకర్ గారు మరి కోలివుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో తెలుగు ప్రేక్షకులకు ఏవిధంగా థ్రిల్ చేస్తారో అలాగే 2014 లో చిక్కడు దొరకడు పేరుతో తెలుగులో అనువాదం అయింది మరీ రీమేక్ ని ప్రేక్షకులు ఎలా రిసివ్ చేస్కుంటారో చూడాలి

Spread the love

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.