షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఇస్మార్ట్ శంకర్ టీం..!

క్రేజీ కాంబినేషన్ గా పేరొందిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో సాధారణంగా ఏ హడావుడి లేకుండా ప్రారంభం అయ్యింది,ఛార్మీ క్లాప్ కొట్టగా ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు కెమెరా స్విచాన్ చేసారు. ఇక రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ తో పాటు మొదటి షెడ్యూల్ మొదలు కానుంది.

ఎక్కడా బ్రేక్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో సినిమా పూర్తి చేసుకొని మే నెలలో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ప్రతి సినిమా తో ఒక కొత్త హీరోయిన్ ని పరిచయం చేసే పూరి గారు ఈ సినిమా కోసం కూడా ఒక కొత్త హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారని సమాచారం, అయితే అను ఇమ్మాన్యూల్ ని తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ సమాచారం మరి ఏది నిజమో మరో వారం రోజుల్లో అఫీషియల్ గా తెలుస్తుంది.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘అర్జున్ రెడ్డి ‘ ఫేమ్ రాజ్ తోట కెమెరామెన్ గా పనిచేస్తున్నారు,పూరి జగన్నాథ్,ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.