ఇంట్రస్టింగ్ సబ్జెక్టుతో మహేష్ బాబు 26..!

అతిత్వరలో మహేష్ బాబు,సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా సెట్స్ మీదకు రానుంది.ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి ‘ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా ఏప్రిల్ 25 న విడుదలవుతుంది.ఇది మహేష్ బాబుకు 25 వ సినిమా కావడం విశేషం.

ఆ తర్వాత జూన్ లో మహేష్ బాబు తన 26 సినిమాని సుకుమార్ గారి దర్శకత్వంలో మొదలుపెట్టనున్నారు.ఈ సినిమా చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం, మరి ఇందులో మహేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుంది అన్న విషయం పై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

రెండో సారి వస్తున్న ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి, గతంలో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ వెండితెరపై ఆకట్టుకోలేకపోయిన బుల్లి తెర పై బాగానే ఆకట్టుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.