పుట్టిన రోజు నాడు మాస్ రాజా కొత్త సినిమాల ప్రకటన..!

ఈ మధ్య మాస్ మహారాజా రవితేజకు సరైన హిట్స్ లేవని చెప్పవచ్చు, ఒక్క రాజా ది గ్రేట్ తప్ప అంతకుముందు ఆ తర్వాత వచ్చిన సినిమాలు అభిమానులను సైతం నిరాశపరిచాయి.ఇక చివరగా వచ్చిన అమర్ అక్బర్ ఆంథోనీ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా మొదలుపెట్టలేదు,ప్రస్తుతం వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.

నభా నటేష్,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా రామ్ తాళ్ళూరి గారు నిర్మించనున్నారు. డిస్కో రాజా అని టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాకు రవితేజ గారు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు,కాగా ఈ నెల 26 న రవితేజ గారి పుట్టిన రోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ విడుదల కానుంది.అలాగే కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంకో సినిమా చేయనున్నారు.

ఇది తమిళంలో సూపర్ హిట్టైన ‘తెరి ‘ సినిమాకి రీమేక్ , ఈ కథకు సంబంధించి స్క్రిప్ట్ పరంగా రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా, తెలుగు నేటివిటీకి దగ్గరగా సంతోష్ శ్రీనివాస్ సిద్ధం చేసారట.ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం అదేరోజు వెలువడనుంది,ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: