జగపతిబాబు సినిమా విషయంలో సీరియస్ అయిన నిఖిల్..!

ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న సినిమా ‘ముద్ర ‘ టి.సంతోష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మామూలుగా మంచి అంచనాలే ఉన్నాయి. కాగా త్వరలోనే విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమా పేరుతో ఈరోజు మరో సినిమా విడుదలయింది .

దర్శకుడు ఎవరో నిర్మాత ఎవరో తెలీని ఈ సినిమా పేరుతో ఆన్ లైన్ బుకింగ్స్ లో మాత్రం నిఖిల్ పేరుతో ఉన్న సినిమా పోస్టర్ పెట్టి ఆశ్చర్యానికి గురి చేసారు. కేవలం సినిమాలో జగపతిబాబు, రావు రమేష్ మాత్రమే ఈ సినిమా అఫీషియల్ పోస్టర్లో కనిపిస్తున్నారు.అచ్చం నిఖిల్ సినిమాకు సంబంధించిన లోగో లానే ఉండడం తో ప్రేక్షకులు కూడా నిఖిల్ సినిమా అనుకొనే ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్నారని సమాచారం.

నిఖిల్ ఈ విషయమై సీరియస్ అయ్యారు, తన ట్వీట్టర్ ద్వారా తన సినిమా విడుదల కావడం లేదని ఇది కావాలనే చేశారని మా సినిమా నిర్మాతలు ఈ విషయం పై చర్యలు తీసుకునే ప్రయత్నం లో ఉన్నారు కాబట్టి ఇది నా సినిమా కాదని బల్లగుద్ది చెప్పారు.నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా ఆవురా సినిమాస్ పతాకంపై రాజ్ శేఖర్ ఆకెళ్ళ, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: