ఈరోజు నుంచి మరింత ఫ్రస్ట్రేషన్..

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ ‘F2’ , సంక్రాంతి బరిలో దిగి ఘనవిజయం సాధించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇక రోజుతో వద్ద కోట్ల క్లబ్ లో చేరనుంది, విజయవంతంగా మూడో వారంలో ప్రదర్శిస్తున్న సందర్భంగా ఈ సినిమాలో మరో ఐదు సీన్లలు కలపనున్నారు.

ఈ విషయాన్ని చిత్ర బృందమే అఫీషియల్ గా పోస్టర్ ద్వారా తెలిపింది, ఈరోజు నుంచి మరింత ఫన్ ఉండనుందని చెప్పారు.ఇక ఈ మధ్య ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ F3 ‘ చేస్తామని దర్శకుడు అనిల్ రావిపూడి హింట్ ఇచ్చారు,దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా , మెహ్రీన్ హీరోయిన్లుగా నటించారు.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: