డిస్కో రాజా మోషన్ పిక్చర్ విడుదల..!

వరుస పరాజయాలతో మాస్ రాజా రవితేజ అభిమానుల దాహాం తీర్చలేకపోతున్నారు, బలుపు, పవర్ తర్వాత వచ్చిన సినిమాలు రవితేజ గారి స్థాయికి తగ్గట్లు లేకపోవడంతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ మధ్య వచ్చిన రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన ఆ తర్వాత వచ్చిన సినిమాలు మళ్ళీ అంతంత మాత్రమే. ఇక అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు సైతం తన తదుపరి సినిమాల పై ఆశలు పెట్టుకున్నారు.

నిన్న రవితేజ గారి పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్ర బృందం శుభాకాంక్షలు చెప్తూ ముందు నుంచి అనుకున్న ‘డిస్కో రాజా’ టైటిల్ ని ఖరారు చేసింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా,ఒక్క క్షణం సినిమాలతో సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక స్టేటస్ సంపాదించుకున్నారు వి.ఐ ఆనంద్ గారు. ఈ కాంబినేషన్ పై నిన్నటి వరకు సాధారణంగా అంచనాలు ఉన్నాయి, ఈ రోజు విడుదల చేసిన పోస్టర్, మోషన్ పిక్చర్ తో అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి.ముఖ్యంగా మోషన్ పిక్చర్ లో తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక రకమైన ఆసక్తిని కలిగించింది.ఇలా టైటిల్ తో పాటు కాంబినేషన్ కూడా సరికొత్తగా ఉండటంతో రవితేజ గారు కూడా గ్యాప్ తీసుకోవడంతో ఈ సినిమా పై ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నట్లు కనిపిస్తుంది.

సై-ఫై నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నాభా నటేష్,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పై రవి తాళ్లూరి నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది, ఇక ఎప్పట్నుంచో ‘తేరి ‘ రీమేక్ పై వస్తున్న పుకార్ల పై ఈ రోజు కూడా ఎలాంటి సమాచారం అందలేదు,సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారన్న విషయం తెలిసిందే.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: