ప్రారంభం అయిన హరీష్ శంకర్ చిత్రం…!

డీజె తర్వాత సంవత్సరం కు పైగా గ్యాప్ తీసుకున్నారు దర్శకులు హరీష్ శంకర్.మొదట్లో దాగుడు మూతలు అనే టైటిల్ తో ఒక సినిమా అనుకున్న అనివార్య కారణాల వల్ల అది స్టార్ట్ కాలేదు.2014 లో కోలివుడ్లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండా’ సినిమాను తెరకెక్కనించనున్నారు,సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఇప్పుడీ ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపి అచంట నిర్మాతలుగా ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది వాల్మీకి అనే టైటిల్ ఖరారు చేసారు,టైటిల్ తో పాటు ఫంట్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

తమిళంలో బాబీ సింహా చేసిన పాత్రలో వరుణ్ తేజ్ చేయనున్నారు,సిద్ధార్ధ చేసిన పాత్రలో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు ప్రస్తుతం నాగ శౌర్య పేరు వినిపిస్తుంది అలాగే హీరోయిన్ల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా,చోటా.కె.ప్రసాద్ ఎడిటర్ గా ఫిక్స్ అయ్యారు.త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది, ఇక దబాంగ్ రీమేక్ తో గబ్బర్ సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకున్న హరీష్ శంకర్ మళ్ళీ అదే సెంటిమెంట్ ఈ రీమేక్ తో జరుగుతుందేమో చూడాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.