ఎన్.జి.కె టీజర్ ఆ రోజే రానుంది…!

కోలివుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవేయిటెడ్ సినిమా ఎన్.జి.కె (నంద గోపాలన్ కుమార్) సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఎన్.జి.కె, డ్రీం వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలాకాలం నుండి అభిమానుల్లో ఉత్కంఠని రేపుతోంది.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఉంది.ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కానుంది, ఈ విషయాన్ని చిత్ర బృందమే అధికారికంగా వెల్లడించింది.

పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నది,ఇందులో సూర్య రైతుల కోసం పోరాడే లీడర్ గా కనిపించనున్నారు.రకుల్ ప్రీతి సింగ్,సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా జగపతిబాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళ,తెలుగుతో పాటు వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: