
మరోసారి హీరోయిన్ ని మార్చేసిన శంకర్…!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా పై ఒక రేంజ్లో అంచనాలు పెరిగి పోయాయి, ఇక నిన్న మొన్నటి వరకు హీరోయిన్ విషయంలో ఒక క్లారిటీ లేదు.మొన్నటి వరకు అను ఇమ్మాన్యూల్,నిన్నటి వరకు నాభా నటేష్ పేరు వినబడింది అదే ఫైనల్ అన్నారు.

ఇప్పుడు చివరకి సవ్యసాచి, మిస్టర్ మజ్ను ఫేమ్ నిధి అగర్వాల్ ని ఫిక్స్ చేసారు, ఈ విషయాన్ని చిత్ర బృందమే అఫీషియల్ గా ట్వీట్టర్ లో పోస్టర్ ద్వారా వెల్లడించింది.ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే లో ప్రేక్షకుల ముందుకు రానుంది.మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా అర్జున్ రెడ్డి ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు,పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.