
పర్ఫెక్ట్ హీరోయిన్ ని సెలక్ట్ చేసిన పూరి జగన్నాథ్..!
క్రేజీ కాంబినేషన్ గా పేరొందిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్ ‘.ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకొని యథాతథంగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది, అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించే టీం నిన్నటి వరకు తెగ వెతికింది.

పూరి జగన్నాథ్ గారు ఫైనల్ గా ఒక గ్లామర్స్ బ్యూటీని సెలెక్ట్ చేసారట, ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో నటించి మెప్పించిన ‘నాభా నటేష్’ ను తీసుకోనున్నారు.ఈ హీరోయిన్ కూడా పూరి గత సినిమాల్లో చేసిన హీరోయిన్ల వలే గ్లామర్స్ గా ఉంది,రామ్ సరసన సరిగ్గా సరిపోయే ఈ ముద్దుగుమ్మ పర్ఫెక్ట్ సెలక్షన్ అనిపిస్తుంది.పూరి మార్క్ లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఎక్కడా బ్రేక్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో సినిమా పూర్తి చేసుకొని మే నెలలో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ‘అర్జున్ రెడ్డి ‘ ఫేమ్ రాజ్ తోట కెమెరామెన్ గా పనిచేస్తున్నారు,పూరి జగన్నాథ్,ఛార్మీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.