షార్ట్ ఫిల్మ్ దర్శకుడితో స్టైల్ స్టార్ …!

షార్ట్ ఫిల్మ్స్ తో తనకంటూ ఒక స్టైల్ ని ఏర్పచుకొని రన్ రాజా రన్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇటు సుజీత్కు అటు శర్వానంద్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సుజీత్ ప్రభాస్ తో సాహో సినిమా మొదలుపెట్టారు, భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవలే వచ్చిన సాహో షేడ్ వన్ ప్రమోషన్ల్ వీడియో ఒక రేంజ్లో ఆకట్టుకొని అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

ఇక్కడే ఈ దర్శకుడి టాలెంట్ ఏంటో మరోసారి బయట పడింది, అయితే ఈ దర్శకుడు ఈ మధ్య అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పారట, కథ విన్న బన్ని కూడా బాగా ఇంప్రెస్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం సాహో తో సుజీత్ , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో అల్లు అర్జున్ ఇద్దరూ బిజీగా ఉండడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలంటే డిసెంబరు వరకు ఆగాల్సిందే, ఎందుకంటే సాహో రిలీజ్ అయ్యాకే నిర్మాత అల్లు అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పారట. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ గురించి ఎలాంటి అధికారిక విషయం రాలేదు, త్వరలోనే ఈ విషయం పై ఇది నిజమా లేదా రూమరా? అనే దాని మీద అధికారికంగా ప్రకటన వస్తుందని అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: