సెకండ్ ఇన్నింగ్స్ తో రానున్న సూపర్ కాంబినేషన్..!

విక్టరీ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.అప్పటి తరంలోనే అబ్బాయి గారు,సూర్యవంశం,రాజా సినిమాలతో అప్పటి ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్ తో అలరించారు.ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్,మల్లీశ్వరి సినిమాలతో తనలోని కామెడీ టైమింగ్ ఇంకో స్థాయిలో అలరించింది, అంతేకాకుండా ఈ రెండు సినిమాలు తన కెరీర్‌లో రెండు స్పెషల్ మూవీస్ గా నిలిచాయి.

ఈ సినిమాలకు దర్శకత్వం వహించింది సీనియర్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ రెడ్డి అయిన క్రెడిట్ మొత్తం వీటికి కథ-మాటలు అందించిన అప్పటి స్టార్ట్ రైటర్ త్రివిక్రమ్ గారికే చెందింది.త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అయ్యాక వీళ్ళ కాంబినేషన్ కోసం సగటు ప్రేక్షకులు సైతం ఎదురు చూసారు. కానీ ఇప్పటి వరకూ అది కార్యరూపం దాల్చలేదు, ఇక వెంకీ కూడా మల్లీశ్వరి తర్వాత నమో వెంకటేష తో పర్వాలేదనిపించుకున్న ఆ తర్వాత ఆ స్థాయి కామెడీ టైమింగ్ తో సినిమాలు రాలేదు, ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమాతో మరోసారి ఆ స్థాయి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక అఆ సినిమా వరకు తన మార్క్ డైలాగులు, ఆ కామెడీ పంచులు కొనసాగించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాలలో ఆ పంచులు కానీ ఆ మాటలు కానీ ఆకట్టుకోలేదు.

ఎప్పట్నుంచో వెంకటేష్ గారితో సినిమా చేద్దాం అనుకుంటున్న ఇన్నాళ్ళకు కుదిరింది, ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నారు, ఫిబ్రవరి నుండి అది మొదలు కానుంది ఈ సినిమా తర్వాత వెంకటేష్ తో సినిమా మొదలౌతుంది.నువ్వునాకు నచ్చావ్ ,వాసు ,మల్లీశ్వరి సినిమాలతో తన స్టైల్ పంచ్ డైలాగులతో వెంకీ కామెడీ టైమింగ్ ను రెండో తరానికి పరిచయం చేసారు,అయితే తన దర్శకత్వంలో రానున్న సినిమాతో ఎలాంటి కామెడీ టైమింగ్ తో వెంకటేష్ గారిని పరిచయం చేస్తారో చూడాలి.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: