శర్వానంద్ ని వెతికే పనిలో 96 టీం…!

గత సంవత్సరం కోలివుడ్లో సూపర్ హిట్ అయిన 96 సినిమాని తెలుగులో దిల్ రాజు నిర్మాణంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ని తెరకెక్కించిన సి‌.ప్రేమ్ కుమార్ యే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.శర్వానంద్, సమంత కలయికలో వస్తున్న ఈ సినిమాకి మరో శర్వానంద్ కావాలట, అయితే ఆ శర్వానంద్ వయస్సు 14 నుంచి 20 లోపు ఉండాలని అంటున్నారు అంటే శర్వానంద్ కు ఆ వయస్సు వాళ్ళకి చాలా దగ్గర పోలికలు ఉండాలన్నమాట. ఈ విషయాన్ని అఫీషియల్ గా చిత్ర బృందమే కాస్టింగ్ కాల్ ద్వారా వెల్లడించింది.

ఆసక్తి గలవారు ఎవరైనా అలాంటి పోలికలతో ఉంటే ఇచ్చిన వివరాలను సంప్రదించాలన్నారు. ఎమోషన్ల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా మార్చిలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.తమిళ వెర్షన్ కి సంగీతం అందించిన గోవింద్ వసంత నే తెలుగులో కూడా సంగీతం అందిస్తున్నారు, ఇదే ఆయనకు ఇక్కడ మొదటి సినిమా కావడం విశేషం.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: